అమెజాన్ లో ఇపుడు వైద్య సేవలు ! 1 m ago
ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్ సర్వీస్ ‘అమెజాన్ క్లినిక్’ ని అమెజాన్ భారత్‌లో ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా, 50కి పైగా వైద్య సమస్యలకు సరసమైన ధరలలో ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్‌ను అందిస్తారు. 'అమెజాన్ క్లినిక్' ప్రారంభంతో, అమెజాన్ భారత్‌లో ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగంలో అడుగుపెడుతోంది. ఈ సేవ యూజర్లకు వివిధ వైద్య సమస్యలపై సులభంగా, త్వరితగతిన డాక్టర్‌తో కన్సల్టేషన్ చేసుకునే అవకాశం అందిస్తుంది.